IWSA Sasi English Medium school at Tirupati on 23.09.2023

IWSA Sasi English	Medium	school	at	Tirupati	on	23.09.2023

మా అంకిత భావానికి ఒ దశాబ్ధం : డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్….

మా అంకిత భావానికి ఒ దశాబ్ధం : డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్….

మా అంకిత భావానికి ఒ దశాబ్ధం : డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్….

✍️ ప్రజాస్వామ్యం న్యూస్✍️
#Revanth—————★
#RC Incharge————★
#Gudur Constituency—-★

💥10 ఏళ్లు పూర్తి చేసుకున్న డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్.

💥నరాల సంభందిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు.

💥న్యూరాలజీ ఆన్ వీల్స్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు

💥డాక్టర్ బింధుమీనన్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

💥ప్రతిష్టాత్మకమైన ‘స్ట్రోక్ యాప్ ‘ ను ప్రారంభించిన డాక్టర్ శ్రీరాం సతీష్.

👉🏻 నరాల సంభందిత వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు ఆర్ధిక స్తోమత లేని పేదల కోసం ఏర్పాటై విజయవంతంగా కొనసాగుతున్న డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ కీలకమైన మైలురాయిని చేరింది. అంకిత భావం, నిబద్ధతతో ముందుకెళ్తున్న ఈ ఫౌండేషన్ 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. K M R నంబియార్ ఛైర్మైన్ గా, ప్రముఖ న్యూరాజస్ట్ డాక్టర్ బింధు మీనన్ కార్యదర్శిగా 2013 ఆగస్టు 26న డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ ప్రారంభమైంది. నరాల సంభందిత సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఉచితంగా వైద్య సహాయం అందించడం ఫౌండేషన్ యొక్క లక్ష్యంగా నేటికీ ముందుకు సాగుతుంది. అంతే కాకుండా స్ట్రోక్, ఎపిలెప్సీ, పార్కిన్సన్స్ వ్యాధులపై కూడా ఫౌండేషన్ అవగాహన కల్పించడం, ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో ఎక్కడా విరామం లేకుండా పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

👉10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత దేశ చరిత్రలో మొట్ట మొదటి సారిగా ప్రత్యేక యాప్ ను ప్రారంభించడం జరిగింది. ‘ స్ట్రోక్ కనెక్ట్ ‘ పేరుతో యాప్ ను ఆదివారం నెల్లూరు రామ్మూర్తి నగర్ లోని డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్ట్రోక్ రోగులను దానికి అనుసంధానం చేసి తద్వారా రోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్ స్ట్రోక్ రోగుల వ్యాధి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సంకేతాలిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ అంకితభావానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. అంతే కాదు ‘న్యూరాలజీ ఆన్ వీల్స్’ పేరుతో ఓ వాహనాన్ని మినీ హాస్పిటల్ గా మార్చి అందులో వివిధ సౌకర్యాలు కల్పించారు డాక్టర్ బింధు మీనన్. ఆ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాలను సందర్శించి పేద వర్గాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ‘న్యూరాలజీ ఆన్ వీల్స్’ ద్వారా ఇప్పటి వరకూ 46 గ్రామాలను సందర్శించి 12వేల మందిని పరీక్షించడం జరిగింది. దీని ద్వారా అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్, మూర్చ వంటి రోగాలను గుర్తించి వారికి ఉచితంగా వైద్య సేవలను అందిస్తుంది డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న విస్త్రృతమైన అవగాహన కార్యక్రమాలు 35వేల మందికి పైగా చేరాయి. ఈ 35వేల మందికి నరాలకు సంభందించిన సమస్యలు, వాటి నివారణపై అవగాహన కల్పించడం జరిగింది. 215 మంది రోగులకు పూర్తి స్థాయిలో మూర్చ, స్ట్రోక్ రోగాలకు ఉచితంగా చికిత్స అందించడంతో పాటూ మందులను కూడా ఉచితంగా అందజేస్తుంది డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్.

👉ఇప్పటికే డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ మూడు భాషల్లో “స్ట్రోక్ హెల్ప్” పేరుతో ఫిజియోథెరపీ యాప్, “ఎపిలెప్సీ హెల్ప్” పేరుతో ప్రత్యేక యాప్ ల ద్వారా సేవలు అందిస్తుంది. అంతే కాకుండా 18008916977 ఫోన్ నెంబర్ ద్వారా టెలీ సేవలను కొనసాగిస్తూ ఆయా రోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఫేస్ బుక్ ద్వారా కూడా విస్త్రృత ప్రచారం చేయడంతో పాటూ “NeuroVoice”, “EduWAND” పేరుతో విద్యాపరమైన సెషన్లు కూడా నిర్వహిస్తోంది… డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్. ఈ ప్రయాణంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి డాక్టర్ బింధు మీనన్ గారికి. పలాటుచి అడ్వకేసీ లీడర్ షిప్ ఫోరమ్ అవార్డు, మృదా స్పిరిట్ ఆఫ్ న్యూరాలజీ అవార్డు, A.B. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నుండి బేకర్ టీచర్ రికగ్నిషన్ అవార్డు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆనర్స్, ఇంటర్నేషనల్ లీగ్ ఎగైనెస్ట్ ఎపిలెప్సీ లీడర్‌షిప్ అవార్డు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అవార్డులు అందులో ఉన్నాయి.

👉డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరో సారి నరాల సంభందిత రోగాలతో బాధపడే వ్యక్తుల జీవితాల్లో మార్పును తీసుకురావాలనే బలమైన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ బింధు మీనన్ వారి బృందం భవిష్యత్తులో కూడా సేవలను కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. నరాల సంభందిత వ్యాధులతో బాధపడే వారికి ఉచిత వైద్య సేవలు అందించడం, ఆయా రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తుందని డాక్టర్ బింధు మీనన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.